రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక్కో ప్రధాన సమస్య నెలకొని ఉందని, వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి పార్టీ శ్రేణులు ఉద్యమాలకు సిద్ధం కావాలని భారాస అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక దిశానిర్దేశం చేశారు.సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధాన్యం, శనగలు, మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వ వైఖరి వంటి అంశాలపై చర్చ జరిగింది. ప్రజల సమస్యలపై పార్టీ బలంగా పోరాడాలని కేసీఆర్ స్పష్టం చేశారు.
రాబోయే రెండేళ్ల పాటు ప్రజాక్షేత్రంలోనే ఉండేలా పోరాట పథకాలు రూపొందించాలని నేతలకు ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తూ ప్రజల్లో పార్టీ బలాన్ని పెంచాలని సూచించారు. ఓటరు జాబితాల సమగ్ర సవరణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.పార్టీ సభ్యత్వ నమోదును ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఇద్దరు కార్యకర్తలను నియమించి వారికి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. మండలాలు, పురపాలికల స్థాయిలో సమన్వయ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందని గుర్తించిన కేసీఆర్, అలాంటి ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని సూచించారు. కొత్త నాయకత్వాన్ని తయారు చేయడంతో పాటు బలమైన వర్గాలకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పారు.త్వరలో పరిషత్, జీహెచ్‌ఎంసీ, వరంగల్, సిద్దిపేట, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున కార్యకర్తలను ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















