మంగళగిరిలో జరిగిన మహానాడు ముగింపు సభలో తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని, పెన్నా మరియు బనకచర్ల ద్వారా ఈ ప్రాజెక్టు అమలైతే ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
సీఎం అంటే కామన్ మ్యాన్ అని పేర్కొన్న చంద్రబాబు.. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే పాలన ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రగతి అనేది ఐచ్ఛికం కాదని, అది తప్పనిసరి అని స్పష్టం చేశారు.2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన చంద్రబాబు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలతో సఖ్యతగా వ్యవహరించాలని, ఎన్నికల సమయంలో మాత్రమే కలిసి పనిచేయడం సరిపోదన్నారు.
వైకాపాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు.. ఆ పార్టీకి విలువలు లేవని, అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిని నడిరోడ్డులో నిలబెడతామని హెచ్చరించారు.పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. రాజకీయ నాయకుడికి ఓపిక, నియంత్రణ చాలా ముఖ్యమని, నోరు జారితే శాశ్వతంగా గుర్తుండిపోతుందని అన్నారు.
మహిళా రిజర్వేషన్లపై కూడా చంద్రబాబు, లోకేశ్ కీలక ప్రకటనలు చేశారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం టికెట్లు ఇవ్వడానికి సిద్ధమని లోకేశ్ ప్రకటించగా.. దానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.వర్చువల్ మహానాడు విజయవంతం కావడంపై చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. 1,875 క్లస్టర్లలో, 12 దేశాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రపంచ రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















