ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకవైపు మండే ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45.2 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 14 జిల్లాల పరిధిలోని 110 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
పల్నాడు, ప్రకాశం, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. కంకిపాడు, సంతనూతలపాడు, బ్రాహ్మణగూడెం, నూజెండ్ల, మార్టూరు, గూడూరు వంటి ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగిపడగా.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 152 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఎస్డీఎంఏ తెలిపింది.
మరోవైపు వడదెబ్బతో వైఎస్సార్ కడప జిల్లా చెన్నముక్కపల్లెలో ఉదయగిరి రామక్క అనే ఉపాధికూలీ మృతి చెందడం విషాదాన్ని నింపింది.విజయవాడలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. బస్టాండ్, రైల్వేస్టేషన్, నిర్మలాకాన్వెంట్ రోడ్డు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే బ్రిడ్జి వద్ద భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్ధగంటపాటు కురిసిన భారీ వర్షం తర్వాత పరిస్థితి కొంత సాధారణమైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















