Mukesh Ambani నేతృత్వంలోని Reliance Industries మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచ కుబేరుల్లో టాప్ స్థానాల్లో ఉన్న ముకేశ్ అంబానీ వరుసగా ఆరో ఆర్థిక సంవత్సరంలోనూ జీతం తీసుకోకుండా కొనసాగుతున్నారు. 2025-26లో కూడా ఆయన వేతనం ‘సున్నా’గానే నమోదైంది. అయితే రిలయన్స్‌లో తనకు ఉన్న 1.61 కోట్ల షేర్లపై వచ్చిన డివిడెండ్ రూపంలో రూ.9.66 కోట్ల ఆదాయం పొందుతున్నారు.
2020లో కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిన సమయంలో, కంపెనీ వ్యాపారాలు పూర్తిగా కోలుకునే వరకు వేతనం తీసుకోనని ముకేశ్ అంబానీ ప్రకటించారు. అప్పటి నుంచి అదే నిర్ణయాన్ని కొనసాగిస్తున్నారు. అంతకుముందు 2008 నుంచి 2020 వరకు ఆయన ఏడాదికి రూ.15 కోట్ల పారితోషికం తీసుకునేవారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ చరిత్రలోనే అత్యధికంగా రూ.95,754 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అయినప్పటికీ ముకేశ్ అంబానీ జీతం తీసుకోకపోవడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇక రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీగా విస్తరిస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ గిగా కాంప్లెక్స్ నుంచి 200 మెగావాట్ సామర్థ్యంతో తొలి సోలార్ మాడ్యూళ్ల బ్యాచ్ విడుదల చేసింది. 720 వాట్ల హై ఎఫిషియెన్సీ హెచ్‌జేటీ సోలార్ ప్యానెల్స్ సాధారణ ప్యానెల్స్ కంటే 10 శాతం ఎక్కువ ఇంధనం ఉత్పత్తి చేస్తాయని కంపెనీ తెలిపింది.
సోలార్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, బయో ఎనర్జీ రంగాల్లో రిలయన్స్ భారీ ప్రణాళికలు అమలు చేస్తోంది. రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో గ్రీన్ ఎనర్జీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తుండగా, రెండు లక్షలకుపైగా హరిత ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
జూన్ 19న జరగనున్న రిలయన్స్ AGMలో జియో, రిటైల్, గ్రీన్ ఎనర్జీ, డీప్ టెక్ రంగాలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















