రాజోలి బండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. తుంగభద్ర జలాలపై తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన హక్కులను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.
సోమవారం సచివాలయంలో ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల, తుంగభద్ర జలాలు తదితర అంశాలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీ కెనాల్‌కు జరుగుతున్న అనధికార నీటి మళ్లింపులు, ఆర్డీఎస్ పరిరక్షణ, ప్రధాన కాలువకు నీటి విడుదలలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులు వివరాలు అందించారు.
మంత్రి మాట్లాడుతూ, తుంగభద్ర నుంచి ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధాన కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల రెండో దశలో మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు జలాశయాలను 2.12 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన 3,165 ఎకరాల భూసేకరణను వెంటనే చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి ప్రాజెక్టుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















