చాలామంది సన్నగా ఉన్నామనే కారణంతో త్వరగా బరువు పెరగాలని మార్కెట్లో లభించే మాస్ గైనర్ పౌడర్లు, స్టెరాయిడ్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే వీటిని వైద్యుల సలహా లేకుండా ఉపయోగించడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లివర్, కిడ్నీలపై భారం పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన బరువు పెరుగుదల కోసం శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అందేలా ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇంట్లో సులభంగా లభించే సహజ పదార్థాలతో తయారు చేసుకునే షేక్స్ శరీరానికి అవసరమైన అదనపు క్యాలరీలు అందించడంతో పాటు కండరాల అభివృద్ధికి సహాయపడతాయి.
1. అరటి పండు – పీనట్ బటర్ షేక్
అరటిపండులో సహజమైన కార్బోహైడ్రేట్లు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం చేసే వారికి ఇది మంచి ఎనర్జీ సోర్స్‌గా పనిచేస్తుంది. పీనట్ బటర్‌లో ఉండే ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి.
తయారీ విధానం:
ఒకటి లేదా రెండు పండిన అరటిపండ్లు, ఒక స్పూన్ పీనట్ బటర్, ఒక గ్లాసు పాలు, కొద్దిగా తేనె తీసుకుని బ్లెండర్‌లో కలిపి షేక్‌గా తయారు చేసుకోవాలి.
2. ఖర్జూరం – బాదం మిల్క్ షేక్
ఖర్జూరాల్లో సహజ చక్కెరలు, శక్తిని అందించే పోషకాలు అధికంగా ఉంటాయి. బాదంలో ప్రొటీన్లు, మంచి కొవ్వులు, ఖనిజాలు ఉండటంతో ఇది శరీర బలానికి ఉపయోగపడుతుంది.
తయారీ విధానం:
5 నుంచి 6 ఖర్జూరాలు, రాత్రంతా నానబెట్టిన 5 బాదం పప్పులు, ఒక గ్లాసు పాలు కలిపి మిక్సీ పట్టాలి. ఈ షేక్‌ను ఉదయం లేదా వ్యాయామం తర్వాత తీసుకోవచ్చు.
3. ఓట్స్ – డ్రై ఫ్రూట్స్ స్మూతీ
ఓట్స్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎక్కువసేపు శక్తిని అందిస్తాయి. డ్రై ఫ్రూట్స్ కలపడం వల్ల అదనపు క్యాలరీలు, పోషకాలు లభిస్తాయి.
తయారీ విధానం:
నానబెట్టిన లేదా ఉడికించిన ఓట్స్, జీడిపప్పు, కిస్‌మిస్, వాల్‌నట్స్, పాలు కలిపి స్మూతీలా తయారు చేసుకోవాలి.
బరువు పెరగాలంటే పాటించాల్సిన నియమాలు
- కేవలం షేక్స్ తాగడం వల్ల మాత్రమే ఆరోగ్యకరమైన బరువు పెరగదు.
- రోజువారీ ఆహారంలో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి.
- వారానికి కనీసం 4 నుంచి 5 రోజులు వ్యాయామం చేయడం మంచిది.
- పుష్‌అప్స్, వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల అదనపు క్యాలరీలు కొవ్వుగా కాకుండా కండరాలుగా మారేందుకు సహాయపడతాయి.
- తగినంత నిద్ర కూడా కండరాల అభివృద్ధికి ఎంతో అవసరం.
షేక్స్ తీసుకునే సరైన సమయం
నిపుణుల సూచనల ప్రకారం ఈ నేచురల్ షేక్స్‌ను ఉదయం అల్పాహారంతో పాటు లేదా సాయంత్రం స్నాక్స్ సమయంలో తీసుకోవచ్చు. వ్యాయామం చేసే వారు వర్కౌట్‌కు ముందు లేదా తర్వాత తీసుకుంటే శక్తి అందుతుంది.
అయితే ప్రతి ఒక్కరి శరీర అవసరాలు భిన్నంగా ఉంటాయి. తక్కువ బరువు ఉండటానికి కారణం ఏదైనా ఆరోగ్య సమస్యా కాదా తెలుసుకోవడానికి వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో సహజంగా బరువు పెరగడం సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















