రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరిలో దూకిన పిఠాపురం పంచాయతీరాజ్ ఇంజినీర్ టి.నూకరాజు మృతదేహానికి పంచనామా పూర్తయింది. అయితే ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో గోదావరిలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటనలో పదేళ్ల కార్తికేయరెడ్డి ఈదుకుంటూ బయటపడ్డాడు. అనంతరం మత్స్యకారులు అతడిని రక్షించారు. మరోవైపు మీనా, సౌజన్య కోసం 15 మందితో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం, మరో పది మంది మత్స్యకారులు బోట్లతో గాలింపు చేపట్టారు.
కుటుంబసభ్యుల ఆచూకీ లభించిన తర్వాతే నూకరాజు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ఆయన కుటుంబసభ్యులు కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
గోదావరిలోకి దూకే ముందు నూకరాజు కుటుంబసభ్యులు తమ సెల్‌ఫోన్లు, పర్సు, ఇతర వస్తువులను కారులోనే వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కారులో మూడు సెల్‌ఫోన్లు, పర్సును స్వాధీనం చేసుకున్నారు. వాట్సప్‌లోని సందేశాలను తొలగించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించి విశ్లేషించాలని పోలీసులు నిర్ణయించారు. ముఖ్యంగా సౌజన్యకు చెందిన ఫోన్ నుంచి కాల్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాకినాడ అశోక్‌నగర్‌లోని ఇంటివద్ద ఉంచిన ద్విచక్ర వాహనం నుంచి మూడు సీల్డ్ కవర్లలోని లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని సౌజన్య రాసినవిగా భావిస్తున్నారు. ఈ లేఖల్లో తమపై జరిగిన ఒత్తిడి, బెదిరింపులకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా రైఫిల్ షూటింగ్ కోచ్ సాధిక్‌ఖాన్‌కు సంబంధించిన అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. సౌజన్య ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తే ఆమెపై ఎలాంటి ఒత్తిడి వచ్చిందన్న దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మరో లేఖలో సౌజన్య భర్త జగదీశ్వరరెడ్డి మరణానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. దీంతో లేఖల్లోని వివరాలను కూడా పోలీసులు కీలక ఆధారాలుగా పరిగణిస్తున్నారు.
ఇప్పటికే నూకరాజు సోదరుడు, సోదరిని పోలీసులు విచారించి కుటుంబ పరిస్థితులు, ఘటనకు దారితీసిన పరిణామాలపై వివరాలు సేకరించారు. గోదావరిలో గాలింపు కొనసాగుతుండగా.. మరోవైపు సెల్‌ఫోన్లు, లేఖల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















