నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, వాటి పేరుతో ఓట్లు అడిగే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
నిజామాబాద్‌లో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నగరంలో కొనసాగుతున్న హౌసింగ్ టవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం పాముల బస్తీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంత్రి పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గృహ ప్రవేశం చేసిన మహిళలకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్హత ఉన్న పేద కుటుంబాలన్నింటినీ దశలవారీగా గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో పేదలకు మెరుగైన గృహ వసతి కల్పించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని తెలిపారు. సంప్రదాయ నిర్మాణ విధానాలతో పాటు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఇందిరమ్మ మోడల్ టవర్స్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరింత వేగంగా, నాణ్యతతో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. పేదలకు సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















