పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మందిలో ఏడుగురు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు.
మృతులను చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన బొంతా బాబు (62), బొంతా మణెమ్మ (55), సంపూర్ణమ్మ (70), లక్ష్మమ్మ (75), గంగమ్మ (50), చౌటుపల్లి సువార్త (45), మరియమ్మ (45)గా గుర్తించారు. వీరంతా బాపట్ల జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలిలోనే నలుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు గుంటూరు జీజీహెచ్‌లో, ఒకరు చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
చిలకలూరిపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు మృతి చెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంపై విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















