వెలిగొండ నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇళ్లు నిర్మించుకుని గృహప్రవేశాలు చేసే వరకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో వెలిగొండ నిర్వాసితులకు అందాల్సిన పరిహారం విషయంలో నిర్లక్ష్యం జరిగిందని మంత్రి ఆరోపించారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.900 కోట్ల పరిహారంలో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు విడతల్లో రూ.318 కోట్లు, రూ.200 కోట్లు, రూ.250 కోట్లు కలిపి రూ.768 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. పరిహారం అందని వారికి కూడా న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టామని, వచ్చిన 1,800 దరఖాస్తులను పరిశీలించి అదనంగా రూ.169 కోట్లు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని పేర్కొన్నారు.
వెలిగొండ నిర్వాసిత గ్రామాల్లోని పశువులకు నెలరోజుల పాటు ఉచితంగా దాణా, ప్రజలకు నిత్యావసర సరుకులు అందిస్తామని మంత్రి తెలిపారు. పనులు పూర్తికాకముందే గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిందని విమర్శించారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ పనులకు వేగం పెంచామని, ఫీడర్ కెనాల్‌లో ఏర్పడిన సమస్యలను పరిష్కరించి 11 కిలోమీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేశామని తెలిపారు. రెండేళ్లలోనే ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















