గుంటూరులో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న పగకు ఓ వ్యక్తి దారుణ హత్యతో ముగింపు పలికిన ఘటన కలకలం రేపుతోంది. ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని భావించి గుంటూరు విడిచి వెళ్లిపోయిన వ్యక్తి.. తన బాబాయి మృతితో చివరిచూపు కోసం తిరిగి నగరానికి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన ప్రత్యర్థులు అతన్ని వెంబడించి పట్టపగలే వేటకొడవళ్లతో నరికి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గుంటూరు కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన పెండ్ర చిన్నా (55) కొన్నేళ్లుగా సూర్యాపేటలో నివసిస్తున్నాడు. 2006లో అదే ప్రాంతానికి చెందిన బుల్లయ్య హత్యకు గురయ్యాడు. ఈ కేసులో చిన్నాపై పోలీసులు అప్పట్లో అభియోగాలు మోపి కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బుల్లయ్య కుటుంబ సభ్యులు చిన్నాపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. అతన్ని హతమార్చేందుకు పలుమార్లు ప్రయత్నాలు జరగడంతో చిన్నా గుంటూరు నుంచి మంగళగిరికి వెళ్లిపోయాడు. అక్కడ కూడా హత్యాయత్నాలు జరగడంతో చివరకు సూర్యాపేటకు మకాం మార్చాడు.
సుమారు 20 ఏళ్లుగా సూర్యాపేటలో పాత ఇనుము దుకాణం నిర్వహిస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. గుంటూరులోని తన బాబాయి మత్తయ్య అనారోగ్యంతో ఈ నెల 29న మృతి చెందడంతో చివరిచూపు కోసం చిన్నా కుటుంబంతో కలిసి నగరానికి వచ్చాడు.
ఆదివారం ఉదయం బాబాయి మృతదేహాన్ని సందర్శించిన అనంతరం అల్పాహారం కోసం బయటకు వచ్చిన సమయంలో దుండగులు అతన్ని వెంబడించినట్లు సమాచారం. ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొందరు వ్యక్తులు చిన్నాను అడ్డగించి కర్రలతో దాడి చేశారు. ఆయన కిందపడిన అనంతరం వేటకొడవళ్లు, కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో చిన్నా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బుల్లయ్య కుమారులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ రాజేష్ తెలిపారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ.. హత్యకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















