కాఠ్మాండూ: జలప్రళయంతో తీవ్రంగా దెబ్బతిన్న నేపాల్ ఇంకా విషాదం నుంచి బయటపడలేదు. ఆరు రోజుల క్రితం సంభవించిన ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. గల్లంతైనవారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లోని పలు జలవిద్యుత్ ప్రాజెక్టులు వరదలకు కొట్టుకుపోయాయి.
ఈ ప్రాజెక్టులకు సంబంధించిన సొరంగాల్లో 930 మందికిపైగా సిబ్బంది చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు నేపాల్ సైన్యం నిరంతరాయంగా సహాయక చర్యలు చేపడుతోంది. ప్రతికూల వాతావరణం, ప్రమాదకర భూభాగం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 903 మంది ప్రాణాలు కోల్పోగా.. 4,200 మందికిపైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైనవారిలో దాదాపు 500 మంది విదేశీయులు ఉన్నట్లు సమాచారం. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
మరోవైపు హిమానీనద శిథిలాలు, భారీ బండరాళ్ల కారణంగా చైనా-నేపాల్ సరిహద్దులో ఓ సరస్సు ఏర్పడింది. దీనివల్ల దిగువ ప్రాంతాల్లో మరోసారి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. భోటెకోషి నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో అప్రమత్తత కొనసాగిస్తున్నారు.
ఈ ముప్పుపై చైనా నుంచి అందుతున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నేపాల్ దిగువ ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. ఆదివారం వరద హెచ్చరికల సందేశాలు పెద్ద సంఖ్యలో ప్రజల ఫోన్లకు చేరాయి. ఇప్పటికే ఆత్మీయులను కోల్పోయి, సర్వం కోల్పోయిన బాధితులకు వరుస హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
వరద ఉద్ధృతి ఎంత తీవ్రంగా ఉందో మరో ఘటన వెల్లడించింది. త్రిశూలీ నదికి ఆదివారం దాదాపు మూడు గంటల పాటు భారీగా వరద పోటెత్తడంతో 130 మీటర్ల పొడవైన ఘ్యాల్చౌక్-చరౌడీ సస్పెన్షన్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షా ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశం ఎదుర్కొంటున్న విపత్తు ఎవరూ ఊహించనిదని.. ఇది హృదయ విదారకమైన ఘటన అని పేర్కొన్నారు. వరదలు సృష్టించిన విధ్వంసాన్ని పూర్తిగా అంచనా వేయడం అధికారులకు కూడా క్లిష్టంగా మారిందన్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, ఇంకా పొంచి ఉన్న ప్రమాదాల కారణంగా సహాయక చర్యలు చేపట్టడం సవాలుగా మారిందని బాలెన్ షా తెలిపారు. అయినప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని సామాజిక మాధ్యమం ద్వారా స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















