దృశ్యం’ సిరీస్‌కు బాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూడో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్‌తో పాటు టబు, శ్రియ, జైదీప్ అహ్లావత్, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘దృశ్యం’ తొలి రెండు భాగాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రధాన అంశం కథలోని ఉత్కంఠ, ఊహించని మలుపులు. మూడో భాగంలోనూ అదే స్థాయిలో థ్రిల్ ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా కథను ఎలాంటి ముగింపుతో తీసుకెళ్లబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇప్పటికే మేకర్స్ ఈ చిత్రానికి ‘ది కన్‌క్లూజన్’ అనే పేరును ఖరారు చేసి, ఈ సిరీస్‌కు ముగింపు పలకనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, మలయాళంలో వచ్చిన ‘దృశ్యం-3’ కథ, క్లైమాక్స్‌కు భిన్నంగా హిందీ వెర్షన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
దీంతో చివర్లో ఎలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారు? విజయ్ సల్గావ్కర్ కుటుంబానికి ఈసారి ఎలాంటి సమస్యలు ఎదురుకానున్నాయి? పోలీసులు అతడిని చివరకు పట్టుకోగలరా? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అక్టోబరు 2 వరకు వేచి చూడాల్సిందే.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















