హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
తొలుత పోలీసు అమరవీరుల స్మృతి స్తూపం వద్ద ఉపరాష్ట్రపతి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సాయుధ బలగాల గౌరవవందనం స్వీకరించిన అనంతరం పరేడ్‌ను పరిశీలించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన పలు బృందాలు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. మహనీయుల పోరాటాలు, త్యాగాలు కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడం దేశ సమైక్యత, సమగ్రత చరిత్రలో కీలక ఘట్టమని వివరించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ సమైక్యతకు చేసిన కృషిని కూడా ప్రస్తావించారు.
కార్యక్రమంలో హైదరాబాద్ విమోచన చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక ప్రదర్శనతో పాటు తెలంగాణ కళారూపాలు, వేయిస్తంభాల గుడి, బతుకమ్మ తదితర అంశాలను ప్రతిబింబించే శకటాలను ప్రదర్శించారు. ‘హైదరాబాద్ విమోచనం’ ఇతివృత్తంతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ మాట్లాడుతూ హైదరాబాద్-జోధ్‌పుర్‌కు మధ్య చారిత్రకంగా విడదీయరాని బంధం ఉందన్నారు. తాను జోధ్‌పుర్ ప్రతినిధిగా ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో అనేకమంది యోధులు పోరాడారని, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కోసం వారు చేసిన పోరాటాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిజాంను ప్రశంసించడంపై విమర్శలు చేశారు. నిజాం పాలనపై చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మల్లు స్వరాజ్యం, రావి నారాయణరెడ్డి వంటి వారు పోరాటం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌ను బీజేపీ చాలా కాలంగా చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో గ్రామగ్రామాన విమోచన దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించే లక్ష్యంతో ముందుకు వెళ్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, జి.కిషన్‌రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















