దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ రద్దు కావడంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగిస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మంగళవారం జరిగిన విచారణకు అనంతబాబును పోలీసులు జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చి హాజరుపర్చారు. ఈ సందర్భంగా జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని ఆయన తరఫున దాఖలైన పిటిషన్‌పై కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. అనంతబాబుకు గతంలో నేరచరిత్ర ఉందని, పలు కేసులు ఇంకా విచారణలో ఉన్నాయని ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు వాదించారు. జైలు నిబంధనల ప్రకారం ఇలాంటి నిందితులకు ప్రత్యేక వసతులు కల్పించకూడదని ఆయన కోర్టుకు తెలిపారు.
మరోవైపు అనంతబాబు తరఫు న్యాయవాదులు ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని వాదించారు. ఈ అంశంపై ఈ నెల 18న కోర్టు తుది ఆదేశాలు ఇవ్వనుందని ప్రత్యేక పీపీ వెల్లడించారు. అదే రోజున అనంతబాబు సెక్యూరిటీ సిబ్బందిని కూడా కోర్టు విచారించనుంది.
ఈ కేసులో ఏ2గా ఉన్న అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కూడా విచారణకు హాజరయ్యారు. అలాగే సాక్షులను బెదిరించిన కేసులో ఏ1గా ఉన్న అనంతబాబు బెయిల్ మంజూరు చేయాలని మరోసారి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















