కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల నటనను బిగ్‌బాస్ షోను తలపించేలా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రెండు పార్టీల నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు వారి చర్యలను గమనిస్తూ నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ అర్హత సాధిస్తాయని సంజయ్ తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రంలో గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులు, అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆధ్వర్యంలో చర్చకు తేదీ, సమయం, వేదికను నిర్ణయిస్తామని తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలన వైఫల్యాలను ప్రజల ముందుంచేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసిన ఖర్చు, అమలు చేసిన సంక్షేమ పథకాలపై కూడా చర్చిద్దామని సవాల్ విసిరారు.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















