నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో భాజపా అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు Congress కారణమని ఆరోపిస్తూ (భాజపా) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి భాజపా నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
డీజీపీ కార్యాలయం వద్ద భాజపా శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు ముందస్తుగా బారికేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భాజపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులతో తోపులాట చోటుచేసుకుంది. పరస్పరం వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.తోపులాట సమయంలో ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి కిందపడిపోవడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఈ ఘటనతో భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
మహదేవప్ప ఆత్మహత్యకు కారణమైన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేయాలని, బాధ్యులపై అరెస్టులు జరగాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయేవరకు పోరాటం కొనసాగుతుందని భాజపా నేతలు స్పష్టం చేశారు.
ఈ ఆందోళన కారణంగా కొంతసేపు డీజీపీ కార్యాలయం పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఉద్రిక్త పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అనంతరం భాజపా కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు.ఈ ఘటనపై పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, శాంతి భద్రతలు దెబ్బతినకుండా చర్యలు చేపట్టారు. మహదేవప్ప ఆత్మహత్య ఘటనపై విచారణ కొనసాగుతోందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















