అత్తాపూర్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్స్‌కు చెందిన సుజుకి కార్ షోరూమ్ సర్వీస్ సెంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
తెల్లవారుజామున సుమారు సమయంలో సర్వీస్ సెంటర్ నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడాన్ని గమనించిన పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే అప్రమత్తమై ఫైర్ స్టేషన్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ అగ్నిప్రమాదంలో సర్వీస్ కోసం వచ్చిన మూడు కార్లు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. మంటలు వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నప్పటికీ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్లకు ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సర్వీస్ సెంటర్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఘటన జరిగిన సమయంలో సర్వీస్ సెంటర్ మూసివుండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో అత్తాపూర్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అగ్నిమాపక శాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ తర్వాతే అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడిస్తామని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















