చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, ఆయన సతీమణి Nara Bhuvaneswari మార్గమధ్యలో రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలను ఆస్వాదించారు.
కుప్పంలో జరిగిన ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తంజమ్మకొట్టాలు వద్ద కల్లుగీత కార్మికులు తాటి ముంజలు తీస్తుండటాన్ని గమనించిన సీఎం దంపతులు అక్కడ ఆగారు.ఈ సందర్భంగా తాటి ముంజలను తింటూ కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వారి కుటుంబ పరిస్థితులు, వృత్తి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను చంద్రబాబు, భువనేశ్వరి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
“కల్తీ లేదు.. కార్బైడ్ లేదు.. పురుగుమందుల గోల లేదు. మా కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన, చల్లనైన తాటి ముంజలు తింటుంటే ఎంతో హాయిగా ఉంది. గ్రామీణ ఆహార ఉత్పత్తులకు మించింది ఏముంటుంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.“తాజా తాటి ముంజలను రుచి చూస్తుంటే చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి” అంటూ భువనేశ్వరి భావోద్వేగంగా స్పందించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















