వేసవి ప్రారంభమవుతుందంటే చాలు చాలా మంది సహజంగా కొబ్బరి బొండాల వైపు ఆకర్షితులవుతారు. ఎండ వేడికి అలసిపోయిన శరీరానికి కొబ్బరి నీళ్లు ఒక అద్భుతమైన సహజ ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు శరీరానికి తక్షణ శక్తిని అందించి డీహైడ్రేషన్‌ను తగ్గిస్తాయి. అయితే “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లుగా, ఏది అయినా పరిమితిలో తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివే అయినా, సరైన విధంగా తీసుకోకపోతే ప్రయోజనాల కంటే సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా చాలా మంది చేసే మొదటి తప్పు ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు తాగడం. మార్కెట్లలో లభించే ప్యాక్ చేసిన డ్రింక్స్‌లో రుచి కోసం చక్కెర, నిల్వ కోసం ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇవి సహజ పోషకాలను తగ్గించడమే కాకుండా ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు తాజా కొబ్బరి బొండాలనే ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
రెండవ తప్పు అతిగా కొబ్బరి నీళ్లు తాగడం. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి మంచిదే అయినా, ఒకేసారి అధిక మోతాదులో తీసుకుంటే కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శరీరంలో పొటాషియం స్థాయులు పెరగడం వల్ల కండరాల బలహీనత కూడా కనిపించవచ్చు.
మూడవ సాధారణ తప్పు భోజనం చేసిన వెంటనే కొబ్బరి నీళ్లు తాగడం. చాలా మంది దాహం తీర్చుకోవడానికి భోజనం తర్వాత వెంటనే తాగుతారు. కానీ ఇది జీర్ణక్రియను మందగించిస్తుంది. కొబ్బరి నీటిలోని ఎలక్ట్రోలైట్లు జీర్ణరసాలను పలుచగా చేసి కడుపు భారంగా అనిపించేలా చేస్తాయి. అందుకే భోజనం చేసిన కనీసం 30–40 నిమిషాల తర్వాత తాగడం ఉత్తమం. సరైన సమయానికి, సరైన మోతాదులో తీసుకుంటే కొబ్బరి నీళ్లు వేసవిలో శరీరానికి అత్యంత ఉపయోగకరమైన పానీయంగా మారుతుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















