మేయర్, పురపాలక ఛైర్మన్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికైన వారికి ప్రజల నుంచి బలమైన మద్దతు లభిస్తుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఏపీ పురపాలక శాసనాల నాలుగో సవరణ బిల్లును శాసనసభలో బుధవారం ఆయన ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇకపై మేయర్, పురపాలక ఛైర్మన్‌లను ప్రజలే నేరుగా ఎన్నుకుంటారని తెలిపారు. ఇప్పటివరకు ఈ పదవులకు పరోక్ష ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు. 1986 వరకు మేయర్, ఛైర్మన్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరిగాయని, 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లో ఉందన్నారు. 2005 నుంచి ఇప్పటివరకు మళ్లీ పరోక్ష ఎన్నికలే జరుగుతున్నాయని చెప్పారు.
తాజా చట్ట సవరణతో ఇకపై ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన మేయర్, ఛైర్మన్‌లపై కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం ఉండదన్నారు. దీంతో పాలనా వ్యవహారాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.
మేయర్, ఛైర్మన్ పదవులపై రాజకీయ ప్రభావం తగ్గడంతో పాటు పట్టణ స్థానిక సంస్థల్లో పాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న నాయకత్వం ఏర్పడుతుందని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















