అప్పుల భారంతో మనస్తాపానికి గురైన ఓ కౌలు రైతు తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామానికి చెందిన నరసింహ మామిడి తోటలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సరైన దిగుబడులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు.
తీసుకున్న రుణాలు చెల్లించలేకపోవడంతో ప్రైవేటు బ్యాంకు, రుణ సంస్థల ఒత్తిడి పెరిగింది. ఇంటిని తనఖా పెట్టినప్పటికీ వాయిదాలు చెల్లించకపోవడంతో నోటీసులు, ఆస్తి సీజ్ వంటి చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఒత్తిడిని తట్టుకోలేక నరసింహ తన భార్య, కుమారుడు, కుమార్తెను తాళ్లతో కట్టేసి మామిడి తోటలోని నీటి సంపులో పడేశాడు. అనంతరం తాను ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఘటనకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో తనపై జరిగిన రుణ వేధింపులు, ఆర్థిక ఒత్తిడిని వివరించాడు. తన కుటుంబాన్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















