నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పాల్దా గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కుమారుడి కళ్లెదుటే ఓ రైతు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
గ్రామానికి చెందిన రైతు గోనె చిన్న లచ్చన్న (45) తన కుమారుడు నవీన్‌తో కలిసి మంగళవారం ఉదయం పొలానికి వెళ్లాడు. సుమారు ఆరు ఎకరాల పొలం కలిగిన ఆయన నారు వేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పొలం పక్కన ఉన్న ఫెన్సింగ్ వైర్‌కు ఇటీవల మంటలు పడటంతో బోరు మోటార్ సర్వీస్ వైర్ కాలిపోయి ఫెన్సింగ్‌పై పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలియక లచ్చన్న నారు వేస్తూ ఫెన్సింగ్‌ను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన కుమారుడు నవీన్ కూడా స్వల్పంగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. అయితే వెంటనే వెనక్కి పడిపోవడంతో అతనికి పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government HyderabadNews India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















