మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై స్థిరాస్తి వ్యాపారి చేసిన ఫిర్యాదు హైదరాబాద్‌లో కలకలం రేపింది. తనను కార్యాలయానికి పిలిపించి సుమంత్‌తో పాటు మరికొందరు దాడికి పాల్పడ్డారని చెంగిచర్లకు చెందిన జి.హరికృష్ణ మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. తనపై ఇనుపరాడ్‌తో దాడి చేయడమే కాకుండా.. కొట్టి చంపేయాలంటూ అనుచరులను సుమంత్ ఉసిగొల్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
హరికృష్ణ ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. గత నెల 30న అర్జెంటుగా మాట్లాడాలంటూ సుమంత్ తనకు ఫోన్ చేశారని హరికృష్ణ తెలిపారు. తాను మరుసటి రోజు కలుస్తానని చెప్పినప్పటికీ వెంటనే రావాలని కోరారని పేర్కొన్నారు. అనంతరం తన స్నేహితుడు రాము కూడా ఫోన్ చేయడంతో అదే రోజు రాత్రి స్నేహితుడు కిరణ్‌తో కలిసి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని రాము కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు.
అక్కడ రాముతో పాటు సుమంత్ కూడా ఉన్నారని, తనను చూడగానే తన పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నావంటూ సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారని హరికృష్ణ ఆరోపించారు. దుర్భాషలాడుతూ ఇనుపరాడ్‌తో దాడి చేశారని, అనంతరం తన అనుచరులతోనూ దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో తన ఎడమ చేతికి తీవ్ర గాయమై ఫ్యాక్చర్ అయ్యిందని, నెత్తుటి వాంతులు కూడా వచ్చినట్లు తెలిపారు.
ఘటన సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు తనను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారని హరికృష్ణ చెప్పారు. అయితే చికిత్స తీసుకుని వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లినట్లు తెలిపారు. అనంతరం చెంగిచర్లలోని ఆసుపత్రిలో ఎడమ చేతికి సిమెంట్ పట్టీ వేయించుకున్నప్పటికీ నొప్పి తగ్గలేదని పేర్కొన్నారు. ఈ నెల 10న ఉప్పల్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రిలో చేతికి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుంటున్న హరికృష్ణ.. తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించిన సుమంత్, ప్రశాంత్, అరుణ్‌కుమార్‌రెడ్డి, కార్తిక్, మహేందర్‌రెడ్డి, రాముపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















