బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఇదే అదనుగా తీసుకుని కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. తక్కువ ధరకు బంగారు నాణేలు ఇస్తామని నమ్మించి రూ.20.25 లక్షలు కాజేసిన ఘటన కృష్ణా జిల్లాలోని పెనమలూరు శివారులో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేటకు చెందిన తిరుపతిరెడ్డి ప్రస్తుతం **విజయవాడ**లో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి అతడికి పరిచయమయ్యాడు. బిల్లులు లేని బంగారు నాణేలను తక్కువ ధరకు ఇస్తానని చెప్పడంతో పాటు, వీడియో కాల్‌లో కొన్ని నాణేలు చూపించి నమ్మకం కలిగించాడు.
20 గ్రాముల బరువున్న 17 బంగారు నాణేలు మొత్తం రూ.37.40 లక్షలు అవుతాయని చెప్పిన శ్రీనివాసరెడ్డి, తక్కువ ధరకు ఇవ్వగలమని ఆశ చూపించాడు. తన వద్ద రూ.20.50 లక్షలు మాత్రమే ఉన్నట్లు తిరుపతిరెడ్డి, అతడి బంధువు మల్లారెడ్డి తెలిపారు. దీంతో నగదు తీసుకుని పెనమలూరు శివారు గంగూరులోని డీమార్ట్ వద్దకు రావాలని కేటుగాళ్లు సూచించారు.అనుకున్న ప్రదేశానికి చేరుకున్న బాధితులను గుర్తుతెలియని వ్యక్తి కలుసుకుని, రోడ్డుకు అవతల ఉన్న కారులో బంగారు నాణేలు ఉన్నాయని చెప్పాడు. నగదు బ్యాగ్ తనకు ఇచ్చి కారు వద్దకు వెళ్లాలని సూచించాడు. బ్యాగ్ ఇచ్చిన వెంటనే, శ్రీనివాసరెడ్డితో పాటు మరో వ్యక్తి ఒక్కసారిగా కారులో ఉడాయించారు.
ఈ సమయంలో కార్ డోర్‌ను గట్టిగా పట్టుకోవడంతో తిరుపతిరెడ్డికి గాయాలయ్యాయి. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు వెంటనే పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, బిల్లులు లేని బంగారం, తక్కువ ధర ఆఫర్ల పేరుతో వచ్చే లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలాంటి సందర్భాల్లో ముందుగా ధృవీకరణ చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులకు నగదు ఇవ్వొద్దని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















