ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలో మరో 2% వాటా విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ చివరి లేదా జులై ప్రారంభంలో సంస్థాగత మదుపర్లకు ఈ వాటాను విక్రయించే అవకాశం ఉందని, దీని ద్వారా సుమారు రూ.10,000 కోట్లు సమీకరించవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇష్యూ పరిమాణం, సమయంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నందున తుది నిర్ణయంలో మార్పులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
తొలి పబ్లిక్ ఆఫర్ (IPO) సమయంలోనే తదుపరి వాటా విక్రయాలకు సిద్ధంగా ఉన్నామని ఎల్‌ఐసీ ఎండీ దొరైస్వామి తెలిపారు. అదనపు వాటా విక్రయంపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 2022లో జరిగిన IPOలో 3.5% వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం సుమారు రూ.21,000 కోట్లు సమీకరించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే బీమా రంగ వృద్ధి స్వల్పంగా మందగించే అవకాశం ఉందని దొరైస్వామి అభిప్రాయపడ్డారు. ఇంధన ధరలు పెరగడం, ప్రజల ఆదాయాలు మరియు పొదుపు సామర్థ్యం తగ్గడం వంటి అంశాలు ఇందుకు కారణమవుతాయని చెప్పారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ప్రభావాన్ని కొంతవరకు ఎదుర్కొంటున్నప్పటికీ, ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే వినియోగం, పొదుపు ధోరణుల్లో మార్పులు వచ్చి బీమా రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















