పరిశ్రమల ఏర్పాటులో వేగం పెంచేందుకు, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని N. Chandrababu Naidu స్పష్టం చేశారు. సచివాలయంలో కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి Sandeep Poundrik నేతృత్వంలోని బృందంతో సమావేశమైన ఆయన, డీ-రెగ్యులేషన్ ఫేజ్-2పై సమగ్రంగా చర్చించారు.ప్రస్తుతం పరిశ్రమల కోసం ఉన్న 800కు పైగా నిబంధనలను వంద లోపుకు తగ్గించాలని, అనుమతులు, లైసెన్సులను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయాలని సీఎం సూచించారు. అలాగే డబుల్ లైసెన్సింగ్‌ను తొలగించి, అధికారుల వేధింపులు లేకుండా థర్డ్‌పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి పాత చట్టాలను రద్దు చేస్తూనే, ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
పరిశ్రమల అనుమతుల విషయంలో ప్రస్తుతం ఉన్న 82 రకాల అనుమతులను దశలవారీగా 57కు తగ్గించాలని, భవన నిర్మాణానికి సంబంధించిన 30 అనుమతులను 18కి పరిమితం చేయాలని సూచించారు. ఒకే శాఖలో ఉన్న అనుమతులను విలీనం చేయడం, పర్మిషన్ విధానం బదులు సమాచార ఆధారిత విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.డీ-రెగ్యులేషన్ ఫేజ్-1లో 23 అంశాలు పూర్తయ్యాయని, ఫేజ్-2లో 28 అంశాలపై పని కొనసాగుతోందని కేంద్ర బృందం వివరించింది. మొత్తం 47 సిఫార్సుల్లో 18 ఇప్పటికే అమలయ్యాయని, మిగిలినవి మే 31 నాటికి పూర్తి చేస్తామని తెలిపింది.
సీఎం చంద్రబాబు, భవిష్యత్తులో ఏఐ ఆధారిత టూల్స్ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో డేటా లేక్, రియల్‌టైం డేటా, సీఎఫ్‌ఎంఎస్, ఈ-వేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వ్యవస్థలను ఉపయోగిస్తున్నామని తెలిపారు.నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్రానికి అనుకూలమైన సరళ అగ్నిమాపక నిబంధనలు అమలు చేయాలని సూచించారు. పర్యావరణ, విద్యుత్ అనుమతులను వేగవంతం చేసి, మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని తెలిపారు. ఎంఎస్‌ఎంఈల విషయంలో ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.అదే విధంగా, ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన వ్యాపారాలకు జీవితకాల చెల్లుబాటు కల్పించాలని, పరిశ్రమల ఏర్పాటుకు పట్టే సమయాన్ని కనీసం 40% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారుభూ వినియోగంలో క్లిష్టత తగ్గించేందుకు డిమాండ్ ఆధారిత జోనింగ్ విధానం తీసుకురావాలని, పారిశ్రామిక పార్కులు, క్లస్టర్లలో భూమి కేటాయింపును వేగవంతం చేయాలని సీఎం సూచించారు. ఒకే నోడల్ ఏజెన్సీ ద్వారా అన్ని అనుమతులు ఇచ్చే విధానం, అఫిడవిట్ ఆధారంగా వ్యాపారం ప్రారంభించే అవకాశం వంటి సంస్కరణలతో పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు..
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















