ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఆర్థిక ఆంక్షలు, ఒత్తిళ్లపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ దేశంపై అమెరికా ‘ఆర్థిక యుద్ధం’ ప్రకటించడాన్ని ఖండించిన ఇరాన్.. ట్రంప్ చర్యలను **‘ఆర్థిక ఉగ్రవాదం’**గా అభివర్ణించింది. అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి విధానాలను అనుసరిస్తున్నారని ఇరాన్ ఆరోపించింది.
ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ‘ఎక్స్’ వేదికగా అమెరికా విధానాలపై విమర్శలు చేశారు. అమెరికా చేపడుతున్న ఆర్థిక చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, దేశాల సార్వభౌమాధికారానికి ముప్పుగా మారుతున్నాయని పేర్కొన్నారు. అమెరికా భారీ రుణ భారం, పెరుగుతున్న వడ్డీ వ్యయాలను ప్రస్తావిస్తూ.. సొంత ఆర్థిక సంక్షోభాలను పరిష్కరించకుండా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడం వల్ల సమస్యలు పరిష్కారం కావని అన్నారు.
అమెరికా రుణ భారం 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సూచించే మీడియా నివేదికలను అరాగ్చీ ప్రస్తావించారు. ఆర్థిక క్రమశిక్షణను పునరుద్ధరిస్తానని ట్రంప్ గతంలో హామీ ఇచ్చినప్పటికీ.. ఆయన అనుసరిస్తున్న కొన్ని విధానాలు రుణ భారాన్ని మరింత పెంచుతున్నాయని ఆ నివేదికలు పేర్కొంటున్నాయని తెలిపారు.
ఇరాన్‌కు సాయం చేసే దేశాలకు ట్రంప్ హెచ్చరిక :
ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ట్రంప్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇరాన్‌కు మద్దతు ఇచ్చే లేదా ఆ దేశంతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఇరాన్ నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా మిత్రదేశాలన్నీ తమతో కలిసి నిలబడాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్‌ను ఏకాకిని చేసి, ఆ దేశాన్ని ఓడించేందుకు కలిసి పనిచేయాలని కోరారు.
ఇరాన్ అణ్వాయుధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలిగి ఉండకూడదని ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా, అమెరికా విధానాలు తమపై ఒత్తిడి పెంచినా తాము వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టం చేసింది. విఫలమైన విధానాలను కొనసాగిస్తే అమెరికాకు భవిష్యత్తులోనూ ఓటమి, ఇరాన్ ప్రజల వ్యతిరేకత తప్ప మరేమీ దక్కదని అరాగ్చీ వ్యాఖ్యానించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















