అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తుండగా.. వాటిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ గాలిబఫ్ స్పష్టం చేశారు. ఆంక్షల వల్ల ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తామని పేర్కొన్నారు.
మరోవైపు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ త్వరలో ఇరాన్‌పై కొత్త ఆంక్షలను ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇరాన్‌కు ఆర్థికంగా, వాణిజ్యపరంగా సహకరించే దేశాలు, సంస్థలు కూడా ఈ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ప్రస్తుతం సైనిక చర్యల కంటే ఆర్థిక ఒత్తిడిని పెంచడంపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది.
ఇరాన్ మాత్రం అమెరికా ఒత్తిడికి తలొగ్గబోమని చెబుతోంది. హోర్ముజ్ జలసంధి విషయంలోనూ ఇరాన్ కఠిన వైఖరినే కొనసాగిస్తోంది. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, తనకు చెందిన స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్ పోర్టులపై అమెరికా దిగ్బంధాన్ని తొలగించడం వంటి షరతులు నెరవేరే వరకు హోర్ముజ్‌ను పూర్తిగా తెరవబోమని గాలిబఫ్ గతంలోనే స్పష్టం చేశారు.
ఈ పరిణామాలతో ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడుతోంది. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా గణనీయంగా తగ్గడంతో సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. ఆగస్టు 21న అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 94.39 డాలర్ల వద్ద ముగిసింది. ఈ వారంలో బ్రెంట్ ధర 6.39 శాతం పెరిగింది
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















