ఉప్పల్ మైదానంలో అజేయంగా వచ్చిన రాజస్థాన్ రాయల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓటమి రుచి చూపించింది. సొంత ప్రేక్షకుల ముందు యువ బౌలర్లు అద్భుతంగా రాణించి మ్యాచ్‌ను తమవైపు తిప్పారు.ఇప్పటివరకు పెద్దగా అంచనాలు లేకుండా ఉన్న సన్‌రైజర్స్ బౌలింగ్ దళం ఈ మ్యాచ్‌లో తమ సత్తాను నిరూపించింది. యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ చెరో 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన్ యువ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. తమకు అవకాశం ఇచ్చిన ప్రతీదాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారని, స్వేచ్ఛగా ఆడి ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంతోనే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.యువ బౌలర్ల కష్టపాటు, ఆకలిని ఈ మ్యాచ్‌లో స్పష్టంగా చూశానని ఇషాన్ అన్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనే వారు మంచి ప్రదర్శన చేశారని, ప్రధాన మ్యాచ్‌లో అదే స్థాయిలో రాణించడం జట్టుకు పెద్ద బలం అని చెప్పారు. బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ మార్గదర్శకత్వం కూడా కీలకమని ఆయన పేర్కొన్నారు.
అభిషేక్ శర్మ త్వరగా ఔటవడం వల్ల కొంత తక్కువ స్కోరు చేసినట్లు అనిపించినా, జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉందని ఇషాన్ తెలిపారు. అభిషేక్ క్రీజులో ఉంటే భారీ స్కోర్లు సాధ్యమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.తాను వికెట్ కీపింగ్ బాధ్యత నుంచి తప్పుకోవడానికి కారణం కూడా ఇషాన్ వివరించారు. స్టంప్స్ వెనుక ఉండటం వల్ల ఫీల్డ్‌లో కమ్యూనికేషన్ తగ్గుతుందని, బౌలర్లకు దగ్గరగా ఉండి ప్రణాళికలు అమలు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ మ్యాచ్‌లో ఆయన స్థానంలో సలీల్ అరోరా వికెట్ కీపింగ్ చేశాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















