పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు ఇజ్రాయెల్ కీలక సహాయం అందించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ నుంచి జరుగుతున్న క్షిపణి, డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు యూఏఈ ఇప్పటికే తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను వినియోగించినప్పటికీ, కొన్ని దాడులు కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో యూఏఈ మిత్రదేశాల సహాయం కోరింది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ తన అత్యాధునిక ఐరన్ డోమ్ వ్యవస్థను యూఏఈకి పంపించినట్లు సమాచారం. అంతేకాకుండా, ఈ వ్యవస్థను సమర్థంగా వినియోగించేందుకు తమ సైనిక దళాలను కూడా అక్కడికి తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ చర్యతో యూఏఈపై జరిగిన పలు క్షిపణి, డ్రోన్ దాడులను విజయవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడైంది.
ఇరాన్ దాడులు పెరిగిన నేపథ్యంలో యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయేద్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఐరన్‌డోమ్‌ను యూఏఈలో మోహరించాయి.
అబుదాబిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మొత్తం 550 బాలిస్టిక్ క్షిపణులు, 2,200 డ్రోన్లు ప్రయోగించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీటిలో అనేక దాడులను ఐరన్‌డోమ్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకోవడంతో యూఏఈకు ఊరట లభించింది.ఈ పరిణామంతో ఇజ్రాయెల్-యూఏఈ మధ్య మిత్రత్వం మరింత బలపడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ తన స్వంత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విదేశాల్లో మోహరించిన ఘటన ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















