జనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ప్రజలు అందించే సమాచారం పూర్తిగా సురక్షితంగా ఉండటమే కాకుండా, డిజిటల్ రూపంలో భద్రపరుస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రక్రియలో దేశ ప్రజలంతా చురుకుగా పాల్గొనాలని కోరారు.
ఆదివారం ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని, తమిళనాడులోని కల్పక్కం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ‘క్రిటికాలిటీ’ సాధించడాన్ని దేశ అణు రంగంలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. భారత అణు శాస్త్రవేత్తల ప్రతిభను ప్రశంసిస్తూ, పౌర అణు కార్యక్రమం దేశ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు. పవన శక్తి రంగంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని, ఉత్పత్తి సామర్థ్యం 56 గిగావాట్లను దాటిందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో భారత్ నాలుగో స్థానంలో నిలిచిందని చెప్పారు.
డైరీ రంగం కూడా వేగంగా మార్పులు చవిచూస్తోందని, భారత సంప్రదాయ రుచులకు ఈ రంగం కొత్త గుర్తింపును తెస్తోందని మోదీ తెలిపారు. ఈశాన్య భారత కళాకారులను ప్రోత్సహించేందుకు అక్కడి వెదురు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ను స్మరించుకుంటూ, ఆయన సాహిత్య, ఆలోచనా వారసత్వాన్ని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతిని విస్తరించడంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















