రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి దోహదపడేలా ప్రతిపాదిత బుల్లెట్ (హైస్పీడ్) రైలు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల అమలులో నేషనల్ హైస్పీడ్ రైలు కార్పొరేషన్ లిమిటెడ్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంగళవారం హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు, వరంగల్ ఎయిర్‌పోర్టుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో తొలుత హైదరాబాద్–పుణె హైస్పీడ్ కారిడార్‌పై చర్చ జరిగింది. ఈ మార్గంలో కోకాపేట, వికారాబాద్‌లో స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు ఉన్నాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, అనంతగిరిలో కూడా స్టేషన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్‌లో మన్ననూరు వద్ద ప్రతిపాదిత స్టేషన్‌కు ‘నల్లమల’ అనే పేరు పెట్టాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ మార్గంలో మన్ననూరు తర్వాత సోమశిల వద్ద కూడా స్టేషన్‌ను ఏర్పాటు చేసేలా నేషనల్ హైస్పీడ్ రైలు కార్పొరేషన్ ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.
వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కూడా సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు. కాకతీయ సామ్రాజ్య వైభవం, చారిత్రక వారసత్వం ప్రతిబింబించేలా ఎయిర్‌పోర్టు డిజైన్లు ఉండాలని ఆయన సూచించారు. ప్రవేశద్వారం వద్ద భారీ ఐలాండ్ నిర్మించి, అందులో రాణి రుద్రమదేవి, రుద్రదేవుడి విగ్రహాలతో పాటు భారీ నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, టీజీఐఐసీ కమిషనర్ శశాంక, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్‌అండ్‌బీ కార్యదర్శి ప్రావీణ్య తదితర అధికారులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















