అత్యాధునిక సాంకేతికతలో మరో కీలక మైలురాయిగా మానవ రహిత డ్రోన్ బోట్ (Sea Drone) చరిత్ర సృష్టించింది. ఇరాన్ దాడిలో కూలిపోయిన అమెరికా AH-64 అపాచీ హెలికాప్టర్ ఘటన తర్వాత, నీటిలో చిక్కుకున్న ఇద్దరు అమెరికా పైలట్లను విజయవంతంగా రక్షించింది ఈ ఆటానమస్ డ్రోన్ బోట్.
ఈ ఘటన హర్మూజ్ జలసంధి సమీపంలో చోటుచేసుకుంది. ప్యాట్రోలింగ్‌లో ఉన్న హెలికాప్టర్‌పై దాడి జరగడంతో అది ఒమన్ తీర ప్రాంతానికి సమీపంలో కూలిపోయింది. వెంటనే అమెరికా నౌకాదళ టాస్క్ ఫోర్స్ 59 అత్యాధునిక సాంకేతిక సహాయంతో రంగంలోకి దిగింది.
టెక్సాస్‌కు చెందిన సరోనిక్ టెక్నాలజీస్ తయారు చేసిన కోర్స్‌ఎయిర్ (Corsair) అటానమస్ డ్రోన్ బోట్‌ను రక్షణ ఆపరేషన్ కోసం ఉపయోగించారు. ఈ డ్రోన్ బోట్ సముద్రంలో శీఘ్రంగా స్పందించి పైలట్లను గుర్తించి సురక్షితంగా రక్షించింది.
ఈ కంపెనీని 2022లో ఆస్టిన్‌లో నలుగురు కలిసి స్థాపించగా, భారతీయ అమెరికన్ ఇంజినీర్ వైభవ్ ఆల్టేకర్ కూడా సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఆయన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో నిపుణుడు కాగా ప్రస్తుతం CTOగా వ్యవహరిస్తున్నారు.
24 అడుగుల పొడవు కలిగిన ఈ డ్రోన్ బోట్ డీజిల్ ఆధారితంగా పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యాన్ని అందించే ఈ సాంకేతికతను అమెరికా సముద్ర నిఘా, మందుపాతరల గుర్తింపు, శత్రు కదలికల పరిశీలన కోసం విస్తృతంగా వినియోగిస్తోంది.
ఈ విజయంతో మానవ రహిత సముద్ర యుద్ధ సాంకేతికతలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















