సరూర్‌నగర్‌లో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బాపూనగర్ రోడ్ నెంబర్-4లోని ఆయన నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పేలుడు ధాటికి ఇంటి గోడలు, తలుపులు, కిటికీల అద్దాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఘటన సమయంలో దేవేందర్, ఆయన భార్య, కుమారుడు ఇంట్లోనే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లయింది.
పేలుడు అనంతరం ఇంట్లో గ్యాస్ స్టవ్, మూడు గ్యాస్ సిలిండర్లు, ఫ్రిడ్జ్, గీజర్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు, అధికారులు పరిశీలించారు. ఆశ్చర్యకరంగా అవన్నీ సురక్షితంగా ఉండటంతో పేలుడు కారణం ఇంకా మిస్టరీగానే మారింది.
ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన ఆనవాళ్లు కూడా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. భారీ శబ్దం ఎలా వచ్చిందో, ఇంటి నిర్మాణం ఎందుకు ధ్వంసమైందో అర్థం కాక స్థానికులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే సరూర్‌నగర్ పోలీసులు, హైడ్రా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కిచెన్ ప్రాంతంలోనే ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు. నిపుణుల సాయంతో పేలుడు కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















