ఇక ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ సిద్ధమైంది. శ్రీకాంత్, లయ జంటగా నటించిన ఈ చిత్రానికి జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో కనిపించారు. జులై 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, ఆశలు, అనుకోని పరిణామాల చుట్టూ కథ సాగుతుంది. వెంకటరమణగా శ్రీకాంత్ కనిపించగా.. ఆయన భార్య పద్మావతిగా లయ నటించారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల పాలైన వెంకటరమణ జీవితంలోకి ఓ దైవిక పుస్తకం రావడం కథలో కీలక మలుపుగా నిలుస్తుంది.
ఆ పుస్తకం ద్వారా వెంకటరమణ జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? సమస్యల నుంచి బయటపడేందుకు అతడికి అది ఎలా ఉపయోగపడింది? పుస్తకం కారణంగా ఎదురైన కొత్త చిక్కులేంటి? అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















