రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి సూచించారు.
ఈ నెల 30న వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో, ఇప్పటికే నమోదు చేసుకున్న రైతులతో పాటు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు కూడా దరఖాస్తు చేసుకుంటే పథకం ప్రయోజనాలు పొందవచ్చని ఆయన తెలిపారు.
కొత్త పట్టాదారులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో) లేదా మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో)కు దరఖాస్తులు సమర్పించాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో గోపి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి రైతుకు పథక ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















