వర్షాకాలం ప్రారంభం, స్కూళ్లు తిరిగి ఓపెన్ కావడంతో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇన్ఫెక్షన్లు, జలుబు, జ్వరం, డెంగ్యూ వంటి వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉండటంతో జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు.
పిల్లల ఆనందానికి ఆటాపాటలు, కిలకిల నవ్వులు ఎంతో అవసరం. కానీ అనారోగ్యం తలెత్తితే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో కలుషిత ఆహారం, నీటి వల్ల జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంటి నుంచి తీసుకెళ్లే తాగునీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. అలాగే డెంగ్యూ నివారణ కోసం ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు పూర్తి చేతుల దుస్తులు ధరించేలా చూడడం కూడా అవసరం.
ప్రస్తుతం ఫ్లూ కేసులు కూడా పెరుగుతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అలర్జీ లేదా ఆస్తమా ఉన్న పిల్లలకు మరింత ప్రత్యేక శ్రద్ధ అవసరం.
పాఠశాలలు ప్రారంభమైన తొలి వారాల్లో పిల్లలు కొత్త వాతావరణానికి అలవాటు పడే క్రమంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకే రోజుకు కనీసం 8 నుంచి 10 గంటల నిద్ర తప్పనిసరి. ఉదయం అల్పాహారం మానకూడదు. ఇడ్లీ, దోసె, ఉప్మా, గుడ్లు, పాలు, పండ్లు వంటి పోషకాహారం ఇవ్వడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
కొత్త తరగతులు, చదువు ఒత్తిడి కారణంగా కొంతమంది పిల్లల్లో ఆందోళన పెరగవచ్చు. తల్లిదండ్రులు వారితో సమయం గడిపి వారి భావాలను అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వర్షంలో తడిసిన దుస్తులు, సాక్స్‌లు, షూస్‌తో ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మ సమస్యలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంటికి వచ్చిన వెంటనే పొడి దుస్తులు మార్చుకునే అలవాటు చేయాలని సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















