ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న సమ్మెను విరమించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఆర్టీసీ పరిరక్షణ దృష్ట్యా కార్మికులు సహకరించాలని ఆయన కోరారు.
సమ్మె ద్వారా సమస్యలకు పరిష్కారం లభించదని పేర్కొన్న మంత్రి, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు.
మొత్తం 32 అంశాల్లో 29 సమస్యలు వెంటనే పరిష్కరించదగినవని, మిగిలిన విలీనం మరియు గుర్తింపు సంఘాల ఎన్నికల అంశాలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















