భారత్‌తో తనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అన్నారు. భారత్ తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు. సిడ్నీలోని భారత కాన్సులేట్ నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వాట్సన్.. భారత్‌తో తన అనుభవాలను పంచుకున్నారు.
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగం కావడం తనకు ఎంతో గౌరవంగా ఉందని చెప్పారు. భారతీయ ప్రజలు తన వ్యక్తిగత జీవితం, క్రికెట్ కెరీర్‌పై అద్భుతమైన ప్రభావం చూపారని, వారితో తనకు బలమైన అనుబంధం ఏర్పడిందని తెలిపారు.
తనకు ఆస్ట్రేలియా కంటే భారత్‌లోనే ఎక్కువ ఆదరణ లభించేదని వాట్సన్ చెప్పారు. 19 ఏళ్ల వయసులో తొలిసారి భారత్‌కు వచ్చినట్లు గుర్తుచేసుకున్న ఆయన.. అప్పటితో పోలిస్తే ఇప్పుడు భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారతీయ వంటకాల్లో శాకాహార ఆహారం తనకు ఎంతో ఇష్టమని కూడా పేర్కొన్నారు.
ఐపీఎల్ కీలక మలుపు
2008లో ప్రారంభమైన ఐపీఎల్ తన కెరీర్‌లో కీలక సమయంలో అద్భుతమైన ప్రదర్శనలు చేయడానికి వేదికగా నిలిచిందని వాట్సన్ వివరించారు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ, అభిమానుల ప్రేమ తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చాయని అన్నారు.
భారత్‌లో తాను విఫలమైన సందర్భాల్లోనూ అభిమానుల నుంచి మద్దతు లభించేదని, అయితే ఆస్ట్రేలియాలో మాత్రం బాగా ఆడితే ప్రశంసలు, విఫలమైతే విమర్శలు ఎదురయ్యేవని చెప్పారు.
వాట్సన్ 2008 నుంచి 2020 వరకు ఐపీఎల్‌లో ఆడారు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. మొత్తం 145 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 3,874 పరుగులు సాధించారు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 92 వికెట్లు పడగొట్టారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















