పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో మిర్తివలస గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు అంతా వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉండగా, సతీశ్ మేడపైకి వెళ్లి దుస్తులు ఆరేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
పెళ్లి డెకరేషన్ కోసం మేడపై ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లు సరిగా ఇన్సులేషన్ లేకపోవడంతో, అవి తాకడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే అతడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
సతీశ్ మృతితో పెళ్లి ఇంటి వాతావరణం తీవ్ర విషాదంగా మారింది. ఒకవైపు పెళ్లి బాజాలు మోగాల్సిన చోట, మరోవైపు కన్నీటి రోదనలు వినిపించాయి. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.గ్రామస్థులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, పెళ్లి డెకరేషన్ సమయంలో విద్యుత్ భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















