దేశవ్యాప్తంగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు మే 26న కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.
సాధారణంగా ప్రతి ఏడాది జూన్ 1 ప్రాంతంలో కేరళలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు ఈసారి ఐదు రోజుల ముందుగానే చేరే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
భారతదేశంలో 50 శాతానికి పైగా సాగుభూమి ఇప్పటికీ వర్షాధారంగా కొనసాగుతోంది. దేశ వ్యవసాయ ఉత్పత్తిలో దాదాపు 40 శాతం దిగుబడి ఈ వర్షాధార సాగు నుంచే వస్తోంది. అందువల్ల నైరుతి రుతుపవనాలు భారత ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి.సకాలంలో, సమృద్ధిగా వర్షాలు కురిస్తే రైతులకు మంచి దిగుబడులు లభించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















