సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా వెండితెరపైకి అడుగుపెడుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ చిత్రాన్ని జులై 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. రషా థడానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. సి. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
ప్రేమకథను శక్తివంతమైన యాక్షన్ అంశాలతో మిళితం చేసి, దర్శకుడు అజయ్ భూపతి తనదైన శైలిలో సినిమాను తీర్చిదిద్దారని చిత్ర వర్గాలు తెలిపాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం రూపొందిందని పేర్కొన్నాయి. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















