నగరంలోని బేగంపేటలో ఓ స్టార్ హోటల్ ఛైర్మన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హోటల్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు ఛైర్మన్ డి.వి.మనోహర్‌తో పాటు హెచ్‌ఆర్ విభాగానికి చెందిన రామ్మూర్తి, ఐటీ విభాగానికి చెందిన ప్రకాష్, జనరల్ మేనేజర్ ఉదయ్ తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు 2023 నుంచి సదరు హోటల్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఛైర్మన్ తనను తరచూ అసభ్యకర వ్యాఖ్యలతో వేధించేవారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వేతన పెంపు గురించి మాట్లాడిన సమయంలో తనను లైంగికంగా వేధిస్తూ, అందుకు ప్రతిఫలంగా లైంగిక కోర్కెలు తీర్చాలంటూ షరతులు విధించారని ఆరోపించారు.
తాను అందుకు నిరాకరించి ప్రతిఘటించడంతో దుస్తులు లాగారని, కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఛైర్మన్ వద్ద పనిచేసే ఇతర మహిళా ఉద్యోగుల పట్ల కూడా ఆయన అసభ్యంగా ప్రవర్తించేవారని బాధితురాలు ఆరోపించారు.
ఇదే సమయంలో హోటల్‌లోని హెచ్‌ఆర్, ఐటీ విభాగాలకు చెందిన కొందరు తనను బెదిరించి ఉద్యోగం నుంచి బలవంతంగా బయటకు పంపించారని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఓ వ్యక్తి న్యాయవాది పేరుతో ఫోన్ చేసి బెదిరించాడని కూడా ఫిర్యాదులో తెలిపారు.
ఈ వ్యవహారంపై గతంలో షీ టీమ్స్, మహిళా సంక్షేమ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు పోలీసులకు వివరించారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన బేగంపేట పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ఆధారాలు సేకరించడంతో పాటు సంబంధిత వ్యక్తులను విచారించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, అదే హోటల్ కార్యాలయంలోని ఛైర్మన్ క్యాబిన్‌లో ఉంచిన బ్యాగు నుంచి రూ.లక్ష నగదు చోరీకి గురైందంటూ హోటల్ సిబ్బంది గతంలో బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఓ ఉద్యోగినిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రెండు ఘటనలకు సంబంధించిన అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















