హైదరాబాద్ నారాయణగూడలోని డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్ర మ్యూజియానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పబ్లిక్‌గార్డెన్‌లోని మ్యూజియాన్ని బుధవారం సందర్శించిన ఆయన వివిధ గ్యాలరీలను పరిశీలించారు. అక్కడ భద్రపరిచిన పురాతన, చారిత్రక వస్తువుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సుమారు 2,500 సంవత్సరాల నాటి ఈజిప్షియన్ మమ్మీని మంత్రి పరిశీలించారు. అరుదైన చారిత్రక సంపదను భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచేలా శాస్త్రీయ పద్ధతుల్లో సంరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మమ్మీ ఉన్న విభాగంలో అవసరమైన సాంకేతిక, భద్రతా ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బుద్ధుని పవిత్ర అవశేషాలు ఉన్న ధ్యానమందిరాన్ని కూడా మంత్రి సందర్శించారు. మ్యూజియంలోని ఇతర పురావస్తు సంపదను కూడా సమర్థంగా సంరక్షించాలని సూచించారు. భవనం పునరుద్ధరణతోపాటు సందర్శకులకు మెరుగైన వసతులు కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
మ్యూజియం పునరుద్ధరణకు అవసరమైన నిధులను త్వరితగతిన విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటానని జూపల్లి తెలిపారు. పునర్నిర్మాణం, పెయింటింగ్, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన అంచనాలను వారంలోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన పనులను నాలుగు నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ సంచాలకుడు ప్రొ. కె.అర్జున్‌రావు, డిప్యూటీ డైరెక్టర్ డా. రాములు నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















