Andhra Pradesh Power Transmission Corporation, APGENCO మరియు రాష్ట్రంలోని మూడు డిస్కంలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 629 ఏఈఈ పోస్టుల భర్తీకి త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
కింది స్థాయిలో సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు తక్షణ సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తాజాగా ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి నోటిఫికేషన్ జారీకి అధికారిక అనుమతులు లభించాయి.
రాష్ట్ర ప్రభుత్వ వార్షిక జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులను రెగ్యులర్ పోస్టుల్లో నియమించనున్నారు. విద్యుత్ సంస్థల అవసరాలకు అనుగుణంగా ఎలక్ట్రికల్, సివిల్, టెలికం విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి.ఈ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ బహుజన విద్యుత్ ఉద్యోగుల యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. సీఎం N. Chandrababu Naidu, మంత్రి Nara Lokesh, మంత్రి Gottipati Ravi Kumarలకు యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.ఎం.రవిశంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















