తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలి రోజే రాజకీయ వేడి రాజుకుంది. సభ ప్రారంభానికి ముందే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాసిన నల్లరంగు టీషర్టులు ధరించిన బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించకపోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి.
పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. మరో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా పోలీసులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. పోలీసుల దాడిలో తనకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు.. కేటీఆర్ పోలీసులపై దాడి చేశారని ఆరోపించారు.
నల్ల టీషర్టులతో సభలోకి అనుమతించకపోతే వాటిని తీసేసి వెళ్తామని బీఆర్‌ఎస్ నేతలు నిరసన తెలిపారు. హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలు బనియన్లతోనే లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బీఆర్‌ఎస్ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని అనంతరం తెలంగాణభవన్‌కు తరలించారు.
ఇదే సమయంలో పోలీసులకు, బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య జరిగిన తోపులాట సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై మధ్యాహ్నం నుంచి శాసనసభలో ప్రత్యేకంగా చర్చ జరిగింది.
ముఖ్యమంత్రి సహా మంత్రులు, కాంగ్రెస్, భాజపా, ఎంఐఎం, సీపీఐ సభ్యులు తాతా మధు వ్యాఖ్యలను ఖండించారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్చ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి పెట్టడంతో సభలో కొద్దిసేపు భావోద్వేగ వాతావరణం నెలకొంది.
మరోవైపు నిషేధిత భూముల జాబితాకు సంబంధించిన 22ఏ అంశంపై చర్చకు భాజపా సభ్యులు పట్టుబట్టారు. ఉదయం నుంచి ఈ అంశంపై ఆందోళన కొనసాగించిన భాజపా.. ప్రభుత్వం స్పందించకపోవడంతో సాయంత్రం సభ నుంచి వాకౌట్ చేసింది.
ఇలా తొలిరోజే నిరసనలు, పోలీసుల ఆంక్షలు, తోపులాట, అరెస్టులు, స్పీకర్‌పై వ్యాఖ్యలు, సభలో భావోద్వేగ చర్చలతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















