ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం మరో విషాదానికి దారి తీసింది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించారన్న కారణంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో సంచలనం సృష్టించింది.పోలీసుల వివరాల ప్రకారం, గాజియాబాద్‌లోని ఓ రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లో నివసిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 12, 14, 16 ఏళ్ల వయస్సు గల ముగ్గురు బాలికలు కరోనా కాలంలో ఫోన్ వినియోగానికి అలవాటు పడ్డారు. క్రమంగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం వ్యసనంగా మారడంతో చదువును నిర్లక్ష్యం చేయడం, స్కూల్‌కు వెళ్లకపోవడం మొదలైంది.
పిల్లల ప్రవర్తనపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఫోన్ వినియోగాన్ని తగ్గించాలని వారిని మందలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఇంట్లో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన ముగ్గురు బాలికలు టౌన్‌షిప్‌లోని 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా, శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గుర్తించి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ విషాద ఘటన ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేస్తోంది.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















