తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను, అటవీ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఐదు రోజులుగా రోజుకో గ్రామంలో తిరుగుతూ పశువులపై దాడులు చేస్తోంది.

మంగళవారం రఘునాథపురం గ్రామంలో ఓ పశువును చంపిన పులి, బుధవారం రాత్రి రాజానగరం మండలంలోని పుణ్యక్షేత్రం – జి.యర్రంపాలెం గ్రామాల మధ్య మళ్లీ దాడి చేసింది. పుణ్యక్షేత్రం గ్రామంలోని ఓ పామాయిల్ తోటలో ఆవును బలితీసుకున్న పులి, అనంతరం జి.యర్రంపాలెం ప్రాంతంలోని మరో తోటలో రెండు ఆవులు, ఒక దూడను చంపింది.గురువారం ఉదయం స్థానికులు ఈ ఘటనను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పులి కదలికలను గుర్తించి పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందుకోసం పుణె, దిల్లీ నుంచి నిపుణుల బృందం రాజమహేంద్రవరం చేరుకుంది. పులి ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన తర్వాత తుపాకీలో మత్తు ఇంజక్షన్ లోడ్ చేసి పులిని అదుపులోకి తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.స్థానికులు రాత్రి సమయంలో బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Entertainment Geopolitics governance Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow



















