చెన్నైలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన వాహనశ్రేణి కారణంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కొత్త విధానాన్ని అమలు చేశారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు పరిపాలనా సంస్కరణలు చేపడుతున్న విజయ్, తన ప్రయాణాల సమయంలో సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకూడదని ప్రత్యేకంగా నిర్ణయించారు.
దీని భాగంగా చెన్నై నీలాంకరైలోని తన నివాసం నుంచి సచివాలయానికి వెళ్లే 17 కిలోమీటర్ల మార్గంలో ఒక వైపు ట్రాఫిక్ కోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కోన్స్ మధ్యలో సీఎం కాన్వాయ్‌ను అనుమతించడం ద్వారా ఇతర వాహనాలకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణం సాఫీగా కొనసాగుతోంది.
ఈ విధానంతో రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉండటమే కాకుండా, సిగ్నళ్ల వద్ద ప్రజలు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం కూడా తగ్గిందని అధికారులు తెలిపారు. సీఎం కాన్వాయ్ వెళ్లిన తర్వాత కోన్స్ తొలగించి సాధారణ ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తున్నారు. ఈ కొత్త విధానం నగర ట్రాఫిక్ నిర్వహణలో ఒక వినూత్న ప్రయత్నంగా నిలుస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















